Pradeep Ranganathan: మళ్ళీ డైరెక్టర్ గా ప్రదీప్ రంగనాథన్.. మీనాక్షి, శ్రీలీలతో ‘మ్యాజిక్’ చేస్తాడట!
సౌత్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, శ్రీలీలతో డైరెక్టర్ గా ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కొత్త సినిమా చేస్తున్నాడు.
Pradeep ranganathan doing a film with sreeleela and meenakshi chaudhary
- డైరెక్టర్ గా ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా
- మీనాక్షి చౌదరి, శ్రీలీలతో ‘మ్యాజిక్’
- త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ గా తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కోమాలి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్.. లవ్ టుడే సినిమాతో హీరోగా మారిపోయాడు. ఆ సినిమా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడటం లేదు మనోడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ స్టార్స్ లిస్టులోకి చేరిపోయాడు.
ఆ తరువాత వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, డ్యూడ్ సినిమాతో మరో రెండు బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాయి. దీంతో, తమిళ ఇండస్ట్రీలో ప్రదీప్ రంగనాథన్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మేకర్స్ అందరూ అతనితో సినిమాలు చేసుకుందుకు క్యూ కడుతున్నారు. అయితే, తాజాగా ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) మళ్ళీ డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నాడట.
Mamitha Baiju: ముసిముసి నవ్వుతో మురిపిస్తున్న మమిత.. క్యూట్ ఫోటోలు
ఇందుకోసం ఇంతవరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రాని సరికొత్త కాన్సెప్ట్ ను తయారు చేసుకున్నాడట. లేడీ ఓరియెంటెడ్ కథతో రానున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరిని హీరోయిన్స్ గా తీసుకున్నాడట. ఫాంటసీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాకు మ్యాజిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుందట.
ప్రెజెంట్ ప్రదీప్ రాంగనాథన్ హీరోగా చేస్తున్న సినిమాలు కంప్లీట్ అవగానే ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడట. దీంతో, ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ఇక ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా Lik త్వరలోనే విడుదల కానుంది. విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
