Nayani Pavani gets Emotional while Remembering her Father and Love Breakup
Nayani Pavani : పలు షార్ట్ ఫిలిమ్స్, ఢీ షో, బిగ్ బాస్ షోలతో పాపులారిటీ తెచ్చుకుంది నయని పావని. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ, పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా నయని పావని ఆహా ఓటీటీ కాకమ్మ కథలు షోకి వచ్చింది. ఈ షోలో తన లైఫ్ లో ఒకేసారి చాలా బాధలు వచ్చాయని తెలిపింది.
నయని పావని మాట్లాడుతూ.. మా నాన్న బిజినెస్ చేస్తారు. అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్. మా అక్క బేబీ షవర్ రోజు మా నాన్నకు స్టేజ్ 3 క్యాన్సర్ అని తెలిసింది. ఆయనకు క్యాన్సర్ ఉందని కూడా అప్పటిదాకా తెలీదు. అక్క ప్రగ్నెంట్, అమ్మ అక్కతో ఉండాలి వాళ్ళు రాలేరు. మా నాన్న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్ లో ఉన్నా నాన్నతో. అప్పుడే నాకు బ్రేకప్ కూడా అయింది. చాలా రోజుల నుంచి ఉన్న రిలేషన్. క్యాన్సర్ అని తెలిసిన మూడు నెలల్లో నాన్న చనిపోయారు. నాన్న డిసెంబర్ 31 చనిపోయారు.
నాన్న చనిపోయారు, బ్రేకప్.. దాంతో డిప్రెషన్ కి వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. నాకు డబ్బులు కావాలి. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాను కానీ వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోయాను. అది తట్టుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అప్పుడు 5 వారాలు ఉన్నాను అని చెప్తూ ఎమోషనల్ అయింది.