Site icon 10TV Telugu

Mega 157 : చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ.. ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్‌..

Nayantara joins in Chiranjeevi Anil Ravapudi

Nayantara joins in Chiranjeevi Anil Ravapudi

మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టించ‌నున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ వార్త‌లే నిజం అయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌ న‌య‌న‌తార అని చెబుతూ చిత్ర బృందం ఓ వీడియోను విడుద‌ల చేసింది.

వీడియో చివ‌రిలో న‌య‌న‌తార.. చిరంజీవి మేన‌రిజంలో హ‌లో మాస్టారు.. కాస్త కెమెరా కొద్దిగా రైట్ ట‌ర్నింగ్ ఇచ్చుకోమ్మా అని చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది.

War 2 teaser : ఎన్టీఆర్ పుట్టిన రోజున‌ వార్ 2 టీజ‌ర్‌.. హృతిక్ రోష‌న్ ట్వీట్ వైర‌ల్‌..

https://youtu.be/d250BZKhBVA?si=4xKyALr3UOCAKviy

కాగా.. చిరంజీవి సైతం న‌య‌న‌తార‌కు స్వాగ‌తం చెబుతూ పోస్ట్ పెట్టారు. హ్యాట్రిక్ మూవీకి స్వాగ‌తం, ఆమెతో క‌లిసి ప‌నిచేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పారు. ఇంత‌క‌ముందు చిరు, న‌య‌న‌తార‌లు క‌లిసి ‘సైరా న‌ర‌సింహారెడ్డి’, ‘గాడ్ ఫాద‌ర్’ మూవీల్లో న‌టించారు.

Hari Hara Veera Mallu : పవ‌న్‌ ‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్..

భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తుండ‌గా, సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. #Mega 157 (మెగా 157), #ChiruAnil వర్కింగ్‌ టైటిల్స్‌.

Exit mobile version