Nayanthara about Balakrishna
Nayanthara : సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి ‘నయనతార’. గత కొంతకాలంగా తమిళ సినిమాలకే పరిమితమైపోయింది ఈ భామ.. అడపాదడపా తెలుగు సీనియర్ హీరోల సినిమాలో కనిపిస్తూ అలరిస్తుంది. ఇటీవలే ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించింది. కాగా ఇప్పుడు ‘కనెక్ట్’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో డబ్ అయ్యి విడుదలవుతుంది.
Balakrishna: CMగా బాలయ్య.. కానీ టైమ్ పడుతుందట!
ఈ మూవీని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నయనతార తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలోనే నయనతారని బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్‌పేరెన్స్ గురించి ప్రశ్నించగా.. ‘బాలకృష్ణ సర్‌తో నేను డిఫరెంట్ జోనర్స్ లో మూవీస్ చేశా. ఆయన్ని చూసి అందరు భయపడతారు గాని, బాలకృష్ణ సర్ చాలా సరదా మనిషి’ అంటూ చెప్పుకొచ్చింది.
‘ఇంతకముందు నేను ప్రభాస్ చాలా ఆకతాయి వ్యక్తి అని చెప్పను గాని, బాలకృష్ణ సర్ ప్రభాస్ కంటే పెద్ద ఆకతాయి’ అంటూ వెల్లడించింది. నయనతార గతంలో ప్రభాస్ తో యోగి అనే సినిమాలో నటించింది. కాగా ఇప్పుడు వస్తున్న నయన్ ‘కనెక్ట్’ సినిమా ఇంటర్వెల్ లేకుండా 99 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ కథ జరగనుంది.