ప్రియుడితో కలిసి పకృతి అందాలను ఆస్వాదిస్తూ ఏంజెల్‌ను మరిపిస్తున్న నయన్..

  • Published By: sekhar ,Published On : September 14, 2020 / 07:30 PM IST
ప్రియుడితో కలిసి పకృతి అందాలను ఆస్వాదిస్తూ  ఏంజెల్‌ను మరిపిస్తున్న నయన్..

Updated On : September 14, 2020 / 8:29 PM IST

Nayanthara and Vignesh Shivan‎ Goa Vacation: లాక్‌డౌన్ కారణంగా చాలాకాలం ఇంటికే పరిమితమైన లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం వరుస టూర్లతో బిజీగా ఉంది. ఇటీవలే ఓనం పండుగ కోసం ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి కొచ్చి వెళ్లిన నయన్.. ప్రస్తుతం గోవా టూర్ వేసింది.


విఘ్నేష్‌, నయన్ తరచుగా విదేశీ యాత్రలకు వెళుతుంటారు. అయితే ఆరు నెలలుగా తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైలోనే ఉండిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో నయనతార తనకు ఎంతో ఇష్టమైన గోవాలో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది.


నయన్ అక్కడ సేదతీరుతున్న ఫొటోలను విఘ్నేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పకృతి అందాలను ఆస్వాదిస్తూ తెల్లటి గౌనులో ఏంజెల్‌లా కనిపిస్తోంది నయన్.. ‘తప్పనిసరి శెలవుల తర్వాత వెకేషన్ కోసం బయటకు వచ్చాం’ అంటూ విఘ్నేష్ కామెంట్ చేశాడు.

https://www.instagram.com/p/CFHPz_Gh1r4/?utm_source=ig_web_copy_link