Nayanthara CONNECT Trailer released by Prabhas
Nayanthara CONNECT : లేడీ మెగాస్టార్ నయనతార మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కనెక్ట్’. నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయనుంది. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ చేతులు మీదగా విడుదల చేశారు మేకర్స్.
Prabhas : అన్‌స్టాపబుల్ సెట్‌లో ‘ప్రభాస్’పై స్పెషల్ AV షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా!
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ‘కరోనా లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్లలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆలా ఇంటికే పరిమితమైన సమయంలో నయనతార కూతురికి దెయ్యం పడుతుంది. ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ అవ్వుతూ, ప్రీస్ట్ ఆ దెయ్యాన్ని ఎలా బంధించాడు’ అనేదే మూవీ కథనం. ఆ పరిస్థితుల మధ్య నయనతార ఎంటువంటి సమస్యలు ఎదురుకోవాల్సి వచ్చింది అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ అయితే భయపెడుతుంది.
కాగా ఈ సినిమా ఇంటర్వల్ లేకుండా 99 నిమిషాల నిడివితో ఉండబోతుంది. అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో అశ్విన్, నయన్ కలయికలో వచ్చిన హారర్ మూవీ ‘మయూరి’ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో సత్యరాజ్, వినయ్ రాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. పృథ్వీ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్‌స్కోర్ ఇస్తున్నాడు.