Prabhas : అన్‌స్టాపబుల్ సెట్‌లో ‘ప్రభాస్’పై స్పెషల్ AV షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా!

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి ప్రభాస్ రానున్నాడు అని గత రెండు రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రభాస్ వస్తున్నాడు అని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా తెగ సందడి చేస్తున్నారు. తాజాగా..

Prabhas : అన్‌స్టాపబుల్ సెట్‌లో ‘ప్రభాస్’పై స్పెషల్ AV షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా!

Prabhas : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి ప్రభాస్ రానున్నాడు అని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రభాస్ వస్తున్నాడు అని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా తెగ సందడి చేస్తున్నారు. తాజాగా నేడు అందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది అంటూ వార్తలు వచ్చాయి.

Prabhas : పవన్ కళ్యాణ్‌కి ప్రభాస్ అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్..

ప్రభాస్ పై నేడు ఒక స్పెషల్ AV ని షో నిర్వాహుకులు షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త ముందుగానే సోషల్ మీడియాలో తెలియడంతో.. రెబల్ స్టార్ అభిమానులు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి చేరుకొని సందడి చేశారు. బైక్ ర్యాలీలు చేస్తూ హంగామా చేశారు. ప్రభాస్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు కావడంతో, అన్‌స్టాపబుల్ వల్ల తమ అభిమాన నటుడిని చూడవచ్చు అంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

అలాగే ప్రభాస్, బాలయ్యలను ఒకే స్టేజి మీద చూసేందుకు టాలీవుడ్ అభిమానులు కూడా ఆతురుతగా ఎదురు చూస్తున్నారు. అయితే నిజంగానే ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడా? లేదా? అనేది మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. మరి చూడాలి అన్‌స్టాపబుల్ టీమ్ స్పెషల్ AV తో ఏమన్నా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనేది.