Nayanthara: “గాడ్‌ఫాదర్”కు నయనతార నోటీసు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్‌ఫాదర్" విడుదలయ్యి, మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో చిరుకి చెల్లిగా లేడీ మెగాస్టార్ నయనతార నటించింది. ఈ సినిమా విజయంపై నయనతార ఆనందం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేసింది.

Nayanthara Press Note on GodFather Movie Success
Nayanthara: మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్‌ఫాదర్” విడుదలయ్యి, మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో చిరుకి చెల్లిగా లేడీ మెగాస్టార్ నయనతార నటించింది. ఈ సినిమా విజయంపై నయనతార ఆనందం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేసింది.
Chiranjeevi : మేం ఏం చేయాలో మాకు తెలీదా? మీడియాపై ఫైర్ అయిన చిరంజీవి.. అంతలోనే..
“గాడ్‌ఫాదర్ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి గారితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కలిగింది. అంతటి గ్రేట్ యాక్టర్ తో నటించేలా చేసిన డైరెక్టర్ మోహన్ రాజా గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాన్ని మరింత పెద్దదిగా చేసినందుకు సల్మాన్ ఖాన్ సర్‌కి ధన్యవాదాలు.
తెరపై నాతో కలిసి నటించిన సత్యదేవ్ మరియు తాన్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక అతని సంగీతంతో గాడ్ ఫాదర్ ని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లిన థమన్ తో పాటు మొత్తం చిత్ర యూనిట్ కి నా ధన్యవాదాలు. చివరగా, పండుగల సీజన్‌లో ఇంతటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అంటూ లేఖలో ప్రస్తావించింది.
HUMONGOUS BLOCKBUSTER #GodFather pic.twitter.com/FC1eiPBsnT
— Nayanthara✨ (@NayantharaU) October 9, 2022