Site icon 10TV Telugu

Nayanthara: జోరుగా ‘జవాన్’ వాయిదా వార్తలు.. నయన్ ఎంట్రీతో ఫుల్‌స్టాప్..!

Nayanthara Starts Dubbing For SRK Jawan Movie

Nayanthara Starts Dubbing For SRK Jawan Movie

Nayanthara: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జవాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో షారుఖ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

Jawan Movie: షారుక్ ‘జవాన్’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

అయితే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ఈ చిత్రాన్ని జూన్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ రిలీజ్ కూడా జూన్ నెలలో ఉండటంతో, జవాన్ మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వార్తలకు తాజాగా చెక్ పెట్టింది స్టార్ హీరోయిన్ నయనతార. ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెప్పేందుకు ముంబై చేరుకుంది. దీంతో జవాన్ సినిమా పనులు యధావిధిగా సాగుతున్నాయని.. ఈ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికే ఉంటుందనే టాక్ మరోసారి జోరందుకుంది.

ఏదేమైనా షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’ మూవీపై నెలకొన్న అనుమానాలకు తాజాగా నయనతార సమాధానం ఇచ్చినట్లయ్యింది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి జవాన్ సినిమా రిలీజ్ విషయంపై చిత్ర యూనిట్ ఏమైనా ప్రకటన చేస్తుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version