Jawan Movie: షారుక్ ‘జవాన్’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ టీజర్ ను మే తొలి వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Jawan Movie: షారుక్ ‘జవాన్’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

Jawan Movie Teaser To Be Out At This Time

Jawan Movie: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమాతో షారుక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Jawan : షారుఖ్ ‘జవాన్’ సినిమా విషయంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు!

ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పటికే అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ను మే తొలి వారంలో రిలీజ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ టీజర్‌ను 2 నిమిషాలకంటే తక్కువ నిడివితో కట్ చేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్‌ను అట్లీ చాలా పవర్‌ఫుల్‌గా కట్ చేసినట్లుగా తెలుస్తోంది.

SRK Jawan: షారుక్ ‘జవాన్’లో అల్లు అర్జున్ ప్లేస్‌లో ఆ హీరో..?

ఇక ఈ సినిమాలో షారుక్ నయా లుక్‌లో కనిపిస్తుండగా, స్టార్ బ్యూటీ నయనతార ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.