Jawan : షారుఖ్ ‘జవాన్’ సినిమా విషయంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు!

షారుఖ్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో జవాన్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ పై ఢిల్లీ హైకోర్ట్..

Jawan : షారుఖ్ ‘జవాన్’ సినిమా విషయంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు!

Shah Rukh Khan Jawan scenes leak

Jawan : బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని బాలీవుడ్ నెంబర్ వన్ అని మరోసారి అనిపించుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీ పై సౌత్ లో కూడా భారీ క్రేజ్ నెలకుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ డ్యూయల్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి రీసెంట్ గా రెండు వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి.

Shahrukh Khan : కాశ్మీర్ లో షారుఖ్ ఖాన్ డంకీ.. వీడియో వైరల్!

ఆ వీడియోలోని సన్నివేశాలు సినిమాలో చాలా కీలకమైనవి. దీంతో షారుఖ్ వెంటనే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఆ వీడియో క్లిప్స్ ని సోషల్ నెట్ వర్క్స్ నుంచి తొలిగించాలి అంటూ కోర్ట్ లో పిటీషన్ వేశాడు. షారుఖ్ ఖాన్ పిటిషన్ ని విచారించిన కోర్ట్.. ఆ వీడియో క్లిప్స్ ని సోషల్ నెట్ వర్క్స్ నుంచి వెంటనే తొలిగించాలి అంటూ సైబర్ పోలీస్ లను ఆదేశించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలిగించారు.

Shahrukh Khan : నేను నిన్ను బాగా పెంచాను.. యాడ్ విషయంలో కూతురిపై షారుఖ్ స్పెషల్ పోస్ట్..

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార (Nayanthara) నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ప్రియమణి, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దీపికా పడుకోణె, సంజయ్ దత్, విజయ్, అల్లు అర్జున్ అతిధి పాత్రల్లో మెరబోతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 2న కచ్చితంగా రిలీజ్ చేస్తామంటూ తెలియజేశారు. మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.