Shahrukh Khan : నేను నిన్ను బాగా పెంచాను.. యాడ్ విషయంలో కూతురిపై షారుఖ్ స్పెషల్ పోస్ట్..

సుహానా నటించిన యాడ్ ని రిలీజ్ చేసి, సుహానా ఖాన్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు తెలిపారు. ఈ ఈవెంట్ లో రెడ్ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా, పద్దతిగా మాట్లాడి సుహానా ఖాన్ అందర్నీ మెప్పించింది.

Shahrukh Khan : నేను నిన్ను బాగా పెంచాను.. యాడ్ విషయంలో కూతురిపై షారుఖ్ స్పెషల్ పోస్ట్..

Shahrukh Khan appreciation post on his daughter Suhana Khan

Shahrukh Khan :  షారుఖ్ ఖాన్ కూతురుగా సుహానా ఖాన్(Suhana Khan) అందరికి పరిచయమే. ఇప్పటికే బాలీవుడ్(Bollywood) పార్టీల్లో కనిపిస్తూ, సోషల్ మీడియాలో(Social Media) బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని బాగానే తెచ్చుకుంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’(The Archie’s) అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వనుంది సుహానా. అయితే హీరోయిన్(Heroine) అవ్వకముందే సుహానా ఖాన్ ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. మేకప్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్‌లైన్‌(Maybelline) కు సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల నియమితమైంది.

మేబెల్‌లైన్‌ కి సంబంధించిన ఓ ఈవెంట్ జరగగా ఇందులో సుహానా నటించిన యాడ్ ని రిలీజ్ చేసి, సుహానా ఖాన్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు తెలిపారు. ఈ ఈవెంట్ లో రెడ్ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా, పద్దతిగా మాట్లాడి సుహానా ఖాన్ అందర్నీ మెప్పించింది. మొదటి సారి సుహానా స్టేజి మీద మాట్లాడటంతో ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. షారుఖ్ అభిమానులు సుహానాని తెగ పొగిడేస్తున్నారు.

Shahrukh Khan appreciation post on his daughter Suhana Khan

సుహానా ఇలా ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా నిలవడం, మొదటి సారి స్టేజిపై చాలా పద్దతిగా మాట్లాడటం, అందరూ సుహానాని అభినందిస్తుండటంతో షారుఖ్ తన కూతురిని ఉద్దేశిస్తూ ఈ ఈవెంట్ లో తన కూతురికి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Suhana Khan : హీరోయిన్ అవ్వకముందే యాడ్స్ పట్టేసిన షారుఖ్ కూతురు..

షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్ వీడియోని షేర్ చేసి.. మేబెల్‌లైన్‌ యాడ్ కు నా అభినందనలు బేటా. చాలా చక్కగా దుస్తులు ధరించావు. చాలా బాగా మాట్లాడావు, బాగా చేశావు. నేను కూడా ఇందులో కొంచెం క్రెడిట్ తీసుకుంటాను, నేను నిన్ను బాగా పెంచాను కాబట్టి. లవ్ యు మై లిటిల్ లేడీ అని పోస్ట్ చేశాడు. తండ్రి షారుఖ్ చేసిన ఈ పోస్ట్ కి సుహానా ఆ.. సో క్యూట్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఓ పక్కన సుహానాను అభినందిస్తూ, మరో పక్క నాన్నగా షారుఖ్ గర్విస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కూతురిని అభినందిస్తూ షారుఖ్ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)