Suhana Khan : హీరోయిన్ అవ్వకముందే యాడ్స్ పట్టేసిన షారుఖ్ కూతురు..

సుహానా ఖాన్ హీరోయిన్ గా ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. మేకప్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్‌లైన్‌ కు సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా నియమితమైంది.

Suhana Khan : హీరోయిన్ అవ్వకముందే యాడ్స్ పట్టేసిన షారుఖ్ కూతురు..

Sharukh Khan Daughter Suhana Khan gets ads and brand ambassador for famous brands

Updated On : April 12, 2023 / 7:54 AM IST

Suhana Khan :  షారుఖ్ ఖాన్ కూతురుగా సుహానా ఖాన్ అందరికి పరిచయమే. ఇప్పటికే బాలీవుడ్ పార్టీల్లో కనిపిస్తూ, సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. త్వరలో జోయా అక్తర్ సినిమా ‘ది ఆర్చీస్’తో సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది సుహానా. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. సాధారణంగా హీరోయిన్స్ కి ఓ పేరు వచ్చిన తర్వాత యాడ్స్ వస్తాయి. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని పలు బ్రాండ్స్ వస్తారు.

కానీ సుహానా ఖాన్ హీరోయిన్ గా ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. మేకప్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్‌లైన్‌ కు సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా నియమితమైంది. మేబెల్‌లైన్‌ కి ఓ యాడ్ కూడా చేసింది సుహానా. తాజాగా ముంబైలో మేబెల్‌లైన్‌ కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేస్తూ సుహానా ఖాన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు తెలపడానికి ఓ ఈవెంట్ ని నిర్వహించారు.

Sharukh Khan Daughter Suhana Khan gets ads and brand ambassador for famous brands

ఈ ఈవెంట్ లో సుహానా ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుహానా నటించిన యాడ్ ని ప్లే చేశారు. అనంతరం సుహానా ఖాన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేను ఇక్కడికి వచ్చి, ఇలా మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేబెల్‌లైన్‌ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. వారి ఉత్పత్తులు చాలా బాగున్నాయి. ఈ బ్రాండ్ ఫ్యామిలిలో నేను భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను అని తెలిపింది.

Priyanka Singh : రియా చక్రవర్తిపై వేశ్య అంటూ దారుణంగా ట్వీట్ చేసిన సుశాంత్ సోదరి.. మరోసారి వార్తల్లో సుశాంత్ మరణం..

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకుండానే, కనీసం ఒక్క సినిమా కూడా చేయకుండానే సుహానా ఇలా ప్రముఖ బ్రాండ్ కి యాడ్స్ చేయడం, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.