Priyanka Singh : రియా చక్రవర్తిపై వేశ్య అంటూ దారుణంగా ట్వీట్ చేసిన సుశాంత్ సోదరి.. మరోసారి వార్తల్లో సుశాంత్ మరణం..
సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ మాఫియా అని, అతని ప్రియురాలు రియా చక్రవర్తి అని అనేక ఆరోపణలు వచ్చాయి. అతని ఫ్యామిలీ కూడా అదే ఆరోపణలు చేసింది.

Sushanth singh sister Priyanka Singh tweet on Riya Chakraborthy
Priyanka Singh : మూడేళ్ళ క్రితం జరిగిన బాలీవుడ్(Bollywood) యువ హీరో సుశాంత్ సింగ్(Sushanth Singh Rajput) ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఆత్మహత్య అని, హత్య అని అనేకమంది ఆరోపణలతో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సుశాంత్ మరణంతో అభిమానులు, ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒక యువ హీరో, అప్పుడప్పుడే స్టార్ డం తెచ్చుకుంటున్న హీరో ఇలా మరణించడంతో అంతా బాధపడ్డారు.
అయితే సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ మాఫియా అని, అతని ప్రియురాలు రియా చక్రవర్తి అని అనేక ఆరోపణలు వచ్చాయి. అతని ఫ్యామిలీ కూడా అదే ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు సుశాంత్ మరణంపై రియాతో పాటు బాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులను విచారించారు. సుశాంత్ ప్రియురాలు రియా వల్లే అతను చనిపోయాడు అని ఆరోపణలు రావడంతో చాలా మంది అభిమానులు, నెటిజన్లు ఆమెపై విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి.
సుశాంత్ మరణం, పోలీసుల విచారణ, ఆ తర్వాత మరో కేసులో రియా జైలుకు వెళ్లి రావడం.. ఇలా వీటన్నిటితో సినిమాలకు దూరమైంది. కానీ కొన్ని నెలల నుంచి మాత్రం అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపించింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న రియా చక్రవర్తి మాట్లాడుతూ.. నేను ఓ షోలో రెగ్యులర్ గా నటించబోతున్నాను. త్వరలో మళ్ళీ సినిమాల్లో కూడా కనిపిస్తాను. పోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఆపేసుకోలేము కదా. అయినా ఇప్పుడు మనం ఎందుకు భయపడాలి. భయపడేవాళ్లు వేరేలా ఉంటారు అని తెలిపింది.
దీంతో రియా చేసిన వ్యాఖ్యలకు సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక సింగ్ కౌంటర్ ఇస్తూ..మీరు ఎందుకు భయపడాతారు? మీ పనే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికి అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న ఆ కొంతమందిని చూసుకొనే నీకు ఇంత ధైర్యం. సుశాంత్ కేసు విచారణ ఆలస్యం కావడానికి బాధ్యులు ఎవరో నాకు తెలుసు అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో రియా పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసినా ఆమె రియాని ఉద్దేశించి అన్నదనే అందరికి అర్థమైంది. దీంతో ప్రియాంక సింగ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో సుశాంత్ మరణం మరోసారి వార్తల్లో నిలిచింది.
तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी!
प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है?कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है।
WhoResponsible 4Delay InSSRCs is obvious
— Priyanka Singh (@withoutthemind) April 10, 2023