Nayanthara: తమ కవల పిల్లల పూర్తి పేర్లను వెల్లడించిన నయన్ దంపతులు

సౌత్ స్టార్ బ్యూటీ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి పెట్టిన పేర్లను పూర్తిగా రివీల్ చేశారు.

Nayanthara Vignesh Shivan Reveals Their Twin Babies Names

Nayanthara: సౌత్ స్టార్ బ్యూటీ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ వార్త పెద్ద దుమారమే రేపింది. నయన్ పెళ్లయిన కొద్దిరోజులకే తల్లి ఎలా అయ్యిందంటూ చర్చ సాగింది. ఇక తమ కవల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటూ ఈ స్టార్ కపుల్ చెప్పుకురావడంతో, సెలబ్రిటీలు వారికి విషెస్ చెప్పుకొచ్చారు.

Nayanthara: డైరెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. చుక్కలు చూపించేందుకు రెడీ అయిన స్టార్ హీరోయిన్..?

అయితే, ఇటీవల తమ పిల్లలతో కలిసి బయట కనిపించారు ఈ జోడీ. కాగా, తాజాగా వారికి పెట్టిన పేర్లను పూర్తిగా రివీల్ చేశారు. నయన్, విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల్లో ఒక కొడుకు పేరు ‘ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్’ అని, రెండో కొడుకు పేరు ‘ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్’గా పెట్టినట్లుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ వార్తను పోస్ట్ చేశారు ఈ స్టార్ కపుల్. ఇటీవల ఓ ఈవెంట్‌లో నయన్ పాల్గొనగా, ఆమెను తన పిల్లల పేర్లు చెప్పాల్సిందిగా అక్కడ కోరారు.

Nayanthara : నయన్ దంపతులు చేసిన పనికి.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్లు!

దీంతో అందరికీ క్లారిటీ ఇచ్చేందుకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇవాళ తమ పిల్లల పూర్తి పేర్లను రివీల్ చేశాడు. ఇక నయన్, విఘ్నేష్ గతేడాది జూన్ 9న ప్రేమవివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇండియన్ సినిమా నుండి పలువురు స్టార్స్ హాజరయ్యారు. కాగా, పెళ్లయిన నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులు అయినట్లుగా ప్రకటించి అందరికీ షాకిచ్చారు.