Nazriya Nazim : హైదరాబాద్ లో ఫస్ట్ చూసిన సినిమా భీమ్లానాయక్..

ఈ ఈవెంట్ లో హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ.. ''చాలా నెర్వస్ గా ఉంది. తెలుగులో నా ఫస్ట్ సినిమా ఇది. పవన్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యు సర్. నేను హైదరాబాద్ లో చూసిన ఫస్ట్ మూవీ.................

Nazriya

Nazriya Nazim :  నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Niveda Thomas : ఈ ఫంక్షన్ నా సినిమా ఈవెంట్ లా ఉంది..

ఈ ఈవెంట్ లో హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ.. ”చాలా నెర్వస్ గా ఉంది. తెలుగులో నా ఫస్ట్ సినిమా ఇది. పవన్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యు సర్. నేను హైదరాబాద్ లో చూసిన ఫస్ట్ మూవీ భీమ్లా నాయక్. సినిమా చాలా బాగుంది. సుకుమార్ సర్ మీ గురించి ఫహద్ చాలా బాగా చెప్తారు. మీరెంత గొప్పవాల్లో చెప్తూ ఉంటారు. మైత్రి వాళ్లకు చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లందరికీ థ్యాంక్ యు. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకొని, నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వివేక్ కి థ్యాంక్స్” అని తెలిపారు.