క్లాస్, మాస్ ఆ రెండింటికీ బాలయ్య బాస్ : ‘NBK 105’ న్యూ పోస్టర్

దసరా సందర్భంగా.. అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘NBK 105’ న్యూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 05:07 AM IST
క్లాస్, మాస్ ఆ రెండింటికీ బాలయ్య బాస్ : ‘NBK 105’ న్యూ పోస్టర్

Updated On : May 28, 2020 / 3:56 PM IST

దసరా సందర్భంగా.. అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘NBK 105’ న్యూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్..

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 105’ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన బాలయ్య లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

పింక్ కలర్ బ్లేజర్‌లో, గాగుల్స్‌తో ఉన్న బాలయ్య లుక్ కిరాక్ ఉంది. ‘క్లాస్, మాస్ ఆ రెండింటికీ మా బాలయ్యే బాస్’.. అంటూ బాలయ్య అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 03.55 నిమిషాలకు ‘NBK 105’ అప్‌డేట్ ఇవ్వనుంది మూవీ టీమ్. టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

Read Also : నిశ్శబ్దం – ‘ఆంథొనీ’గా మాధవన్!

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌‌కాగా, భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కథ : పరుచూరి మురళిమాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..