NBK 106.. బాబు రెడీ బాబు.. మార్చిలో ముహూర్తం..

రామోజీ ఫిలిం సిటీలో బాలకృష్ణ, బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్..

  • Publish Date - February 25, 2020 / 08:32 AM IST

రామోజీ ఫిలిం సిటీలో బాలకృష్ణ, బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్..

బాలయ్య అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది. నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న NBK 106 సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 3నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 6న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడని, అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్ అని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా వారణాసిలో ఈనెల 26 నుంచి షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ బాలయ్య వ్యక్తిగత పనుల వల్ల వాయిదా వేశారు. మార్చి 3 నుంచి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

See Also>>చరణ్‌తో ‘మనం’ దర్శకుడు

ఓపెనింగ్ రోజు ‘నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే అది శాసనం.. చెక్ ఇన్ పబ్లిక్’.. అంటూ బాలయ్య తనదైన శైలిలో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు : ఎం.రత్నం, కెమెరా : సి.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు.

Read More>>నానికి జున్ను ముద్దులు.. క్యూట్ బర్త్‌డే విషెస్..