Bad Girlz : సినిమాలకు సీక్వెల్స్ కామన్.. ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ కి సీక్వెల్..

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం బ్యాడ్ గాళ్స్(Bad Girlz).

Neeli Neeli Aakasam song sequel in Bad Girlz movie

Bad Girlz : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం బ్యాడ్ గాళ్స్(Bad Girlz). ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ డైరెక్టర్ మున్నా ధులిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘ఇలా చూసుకుంటావే’ అనే సాంగ్ త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. కాగా.. ఈ సాంగ్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. ఈ పాట యాంక‌ర్ ప్రదీప్ సూపర్ హిట్ సాంగ్ నీలి నీలి ఆకాశం కు సీక్వెల్ అని సమాచారం.

Allu Arjun Atlee : ఇక మొదలెడదామా..? అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచి..? దీపికా కూడా రెడీ..

దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ త్వ‌ర‌లోనే ‘ఇలా చూసుకుంటానే’ అనే పాటను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పాట‌కి చంద్ర బోస్ లిరిక్స్ అందించ‌గా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట సిద్ శ్రీరామ్ పాడిన పాట ‘నీలి నీలి ఆకాశం’ పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం అని చెప్పారు. ఇది పూర్తి ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ అని చెప్పుకొచ్చారు.