Neeli Neeli Akasham Song Sequel
Neeli Neeli Akasham Song Sequel : గతంలో ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలి నీలి ఆకాశం.. సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సాంగ్ కి సీక్వెల్ అంటూ ఆ సినిమా డైరెక్టర్ మున్నా తన నెక్స్ట్ సినిమాలో ఒక కొత్త పాట రాయించారు. తాజాగా ఆ సాంగ్ ని రిలీజ్ చేసారు.(Neeli Neeli Akasham Song Sequel )
నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్, అప్సర.. పలువురు కీలక పాత్రల్లో మున్నా ధులిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Vishal : విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?
తాజాగా ఈ బ్యాడ్ గాళ్స్ సినిమా నుంచి ‘ఇలా చూసుకుంటానే..’ అనే మెలోడీ పాటను రానా దగ్గుబాటి రిలీజ్ చేసారు. నీలి నీలి ఆకాశం సాంగ్ చేసిన టీమ్ ఈ సాంగ్ ని కూడా చేసింది. ఆ సాంగ్ రచయిత చంద్రబోస్ పాట రాయగా అనూప్ రూబెన్స్ అదే ట్యూన్ లో సంగీతం ఇవ్వగా సిద్ శ్రీరామ్ పాడారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి..
ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నీలి నీలి ఆకాశం.. పాట సీక్వెల్ గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్, మలేషియా ప్రకృతి అందాలలో షూట్ చేసాము. ప్రస్తుతం షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : OG నుంచి కలర్ ఫుల్ పోస్టర్.. సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?