Neevalle Lyrical Video out now from Tribanadhari Barbarik
వశిష్ట సింహ, సత్యరాజ్, సత్యం రాజేశ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ త్రిభాణదారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకక్కుతోంది. స్టార్ దర్శకుడు మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నీవల్లే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. రఘురాం లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు.
Lavanya : వాటి కోసమే మస్తాన్ సాయి ఇంటికి వెళ్లింది.. లావణ్య నాయవాది కామెంట్స్..
ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతాన్ని అందించింది. పాటలోని సీన్స్ చూస్తుంటే యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూరైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది.