Neil Nitin Mukesh was detained in America airport Because Officers refused to believe he was Indian
Neil Nitin Mukesh : మనం విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అక్కడ ఎయిర్ పోర్ట్ లో, బయట ఇమిగ్రేషన్ అధికారులు మనల్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అందుకే మన ఐడెంటిటీ తెలిపే పాస్ పోర్ట్, వీసాలు మన దగ్గర ఉంచుకోవాలి. అలా ఉన్నా ఒక్కోసారి అవి ఫేక్ ఏమో అని ప్రశ్నించే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అలా ఓ ఇండియన్ నటుడికి ఎదురైంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ని అమెరికా ఎయిర్ పోర్ట్ లో నువ్వు ఇండియన్ కావంటూ నిర్బంధించారు.
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇతని తాత ముకేశ్, తండ్రి నితిన్ ముకేశ్ స్టార్ సింగర్స్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన నీల్ నితిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. నీల్ నితిన్ తెలుగులో సాహో, కవచం సినిమాల్లో నటించాడు. కవచంలో విలన్ గా నటించగా, సాహోలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల హిసాబ్ బరాబర్ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో నీల్ నితిన్ గతంలో అమెరికాలో తనని నిర్బంధించిన సంగతిని పంచుకున్నాడు.
Also Read : Mohan Babu : నా ఆస్తిపై ఎవరికీ అధికారం లేదు.. మనోజ్ తిరిగివ్వాల్సిందే.. మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు…
నీల్ నితిన్ ముకేశ్ మాట్లాడుతూ.. నేను న్యూయార్క్ సినిమా చేస్తున్నప్పుడు అమెరికా విమానాశ్రయంలో నన్ను నిర్బంధించారు. నా దగ్గర ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నా నేను భారతీయుడిని అని నమ్మడానికి నిరాకరించారు. అప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు నన్ను అదుపులోకి తీసుకున్నారని పెద్ద వార్తగా మారింది. వాళ్ళు నన్ను కనీసం సమాధానం కూడా చెప్పనివ్వలేదు. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. నాలుగు గంటల పాటు నన్ను నిర్బంధించారు. ఓ నాలుగు గంటల తర్వాత నా దగ్గరికి వచ్చి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు అని అడిగితే నేను ఏమి మాట్లాడకుండా జస్ట్ నా పేరు గూగుల్ చేయండి అన్నాను. అప్పుడు వాళ్ళు గూగుల్ లో నా డీటెయిల్స్ చూసి ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత నా ఫ్యామిలీ గురించి, వారసత్వం గురించి ప్రశ్నించారు. గూగుల్ లో చూసి నిర్దారించుకున్న తర్వాత నన్ను వదిలేసారు అని తెలిపాడు.
Also Read : Aaradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. మళ్ళీ ఆ విషయం మీదే..
నీల్ నితిన్ ఇండియన్ అయినా తన లుక్స్ వల్ల తనని అమెరికా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అలా నిర్బంధించి ప్రశ్నించి ఉంటారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా మందికి జరిగాయి. సెలబ్రిటీలు కూడా ఇలాంటి ఘటనలు ఫేస్ చేసారు. షారుఖ్ ఖాన్ కి కూడా అమెరికా ఎయిర్ పోర్ట్ లో చెకింగ్ కోసం అని ఓ చేదు సంఘటన ఎదురైన సంగతి తెలిసిందే.