Aaradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. మళ్ళీ ఆ విషయం మీదే..

తాజాగా ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ వార్తల్లో నిలిచింది.

Aaradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. మళ్ళీ ఆ విషయం మీదే..

Aishwarya Rai Daughter Aaradhya Bachchan went to Court again

Updated On : February 3, 2025 / 10:09 PM IST

Aaradhya Bachchan : మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూతురిగా ఆరాధ్య బచ్చన్ అందరికి పరిచయమే. రెగ్యులర్ గా ఐశ్వర్య ఆరాధ్యను తనతో పాటు ఈవెంట్స్ కి, బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అలా ఐశ్వర్యతో కలిసి వచ్చినప్పుడల్లా ఆరాధ్య బచ్చన్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆరాధ్య బచ్చన్ వార్తల్లో నిలిచింది. ఆరాధ్య ఓ విషయంలో బచ్చన్ కోర్టుకెళ్లింది.

Also See : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిజర్ వచ్చేసింది.. ఈసారి మొత్తం యాక్షన్..

గతంలో 2023లో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం బాగోలేదని కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానల్స్ వార్తలు పబ్లిష్ చేసాయి. కొన్నైతే ఏకంగా ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేసాయి. అప్పట్లోనే దీనిపై ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించింది. తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆశ్రయించగా కోర్టు ఆ యూట్యూబ్ ఛానల్స్ కి, గూగుల్ కి, సైట్స్ కి, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి వార్నింగ్ ఇస్తూ ఆ తప్పుడు వార్తలను తీసేయమని చెప్పింది.

Also See : సినిమా కోసం.. అజిత్ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో చూడండి..

అయితే కొంతమంది ఇంకా ఆ న్యూస్ తీసేయకపోవడం, ఆ వార్తలు ఇంకా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతుండటంతో మరోసారి ఆరాధ్య బచ్చన్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొంది ఆరాధ్య. దీంతో హైకోర్టు గూగుల్ కి నేడు నోటీసులు జారీ చేసింది. దీనిపై మార్చ్ 17న తదుపరి విచారణ జరగనుందని కోర్టు ప్రకటించింది. మరి ఈ లోపు గూగుల్ తన డేటాలో ఆరాధ్య తప్పుడు వార్తలను తీసేస్తుందా లేదా చూడాలి.