Nerella Sarada's shocking comments on casting couch in Tollywood industry
Casting Couch: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం తరచూ వార్తల్లో వింటూనే ఉంటాము. అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకులు, నటుల దగ్గర అమ్మాయిలు మోసపోవడం జరుగుతూనే ఉంది. అయితే, ఇలాంటి సమస్యలు తరుచు జరుగుతూనే ఉన్నప్పటికీ (Casting Couch)బాధితులు బయటకు వచ్చి న్యాయం కోసం పోరాటం చేయడం చాలా తక్కువ అని చెప్తున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.
“సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఫీల్డ్. అందులో రాణించాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. కానీ, ఆ కోరికనే చాలా మంది పెద్దవాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అవకాశాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు మా దగ్గరకు చాలా వస్తూనే ఉంటాయి. కానీ, మధ్యలోనే విరమించుకుంటారు. మధ్యలో ఏం జగురుతుందో తెలియదు. ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని సెటిల్ చేస్తారా, లేక వారిని ఎవరైనా భయపెడతారా తెలియదు కానీ, మధ్యలోనే ఆ కేసును వితిడ్రా చేసుకుంటారు. ఇలాంటివి నేను చాలా చూశాను.
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబందించిన ఒక పెద్ద నిర్మాతపై కూడా మా దగ్గరకు ఒక కేసు వచ్చింది. అతనికి పెళ్ళై, పిల్లలు ఉన్నా నువ్వే నా భార్యవి అంటూ ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఆ నిర్మాత రీసెంట్ గా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆయన పేరు నేను చెప్పలేను అంటూ చెప్పుకొచ్చారు. ఆలాగే.. సినీమా ఇండస్ట్రీ అంటే వాళ్ళు వేరే లోకంలో ఉంటారని, అందులో నుంచి ఎలాంటి వార్తలను వారు బయటకు రానివ్వరు అంటూ చెప్పుకొచ్చారు నేరెళ్ల శారదా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే, నేరెళ్ల శారదా చెప్పిన ఆ పెద్ద నిర్మాత ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.