Netflix acquired Suriya 46 movie OTT rights for huge price.
Suriya 46: ‘సార్’ సినిమా నుంచి తన రూట్ మార్చాడు టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి. అప్పటివరకు యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ చేసిన ఈ వెంకీ సార్ సినిమా నుంచి కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను చేయడం స్టార్ట్ చేశాడు. ఆలా చేసిన మొదటి సినిమానే సార్. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత వెంకీ తెరకెక్కించిన సినిమా లక్కీ భాస్కర్.
స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ రంగంలో జరిగే గ్యాంబ్లింగ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఇక ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తరువాత ఇప్పుడు మరోసారి తమిళ హీరోతో సినిమా చేస్తున్నాడు వెంకీ అట్లూరి. ఆ హీరో మరెవరో కాదు సూర్య(Suriya 46). చాలా కాలం క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.
Vijay Sethupathi: బిచ్చగాడు కత్తి పడితే.. అదిరిపోయిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్.. టైటిల్ ఏంటంటే?
సార్, లక్కీ భాస్కర్ లాగే ఈ సినిమా కూడా సరికొత్త కథ, కథనాలతో రానుంది అని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ను కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. అది కూడా రికార్డ్ ధరకి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.85 కోట్లు ఆఫర్ చేసిందట. అదే అమౌంట్ కు డీల్ కూడా క్లోజ్ అయ్యిందని సమాచారం. అయితే, సినిమా ఇంకా కంప్లీట్ కాకూండా, కనీసం టైటిల్ కూడా ఫిక్స్ కాకుండా ఈ రేంజ్ లో డిమాండ్ రావడం అంటే మాములు విషయం కాదు.
కాబట్టి, సినిమాలో దమ్ము ఉంది కాబట్టే అన్ని కోట్లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమాతో వరుసగా మూడో హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మమిత బైజు కీ రోల్ చేస్తోంది. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.