Vijay Sethupathi: బిచ్చగాడు కత్తి పడితే.. అదిరిపోయిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్.. టైటిల్ ఏంటంటే?

విజయ్ సేతుపతి(Vijay Sethupathi)- పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేసిన మేకర్స్.

Vijay Sethupathi: బిచ్చగాడు కత్తి పడితే.. అదిరిపోయిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్.. టైటిల్ ఏంటంటే?

Vijay sethupathi Slum dog movie first look released

Updated On : January 16, 2026 / 11:45 AM IST
  • విజయ్ సేతుపతి- పూరి కాంబోలో ‘స్లమ్ డాగ్’
  • సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల
  • చేతిలో కత్తితో విజయ్ లుక్ అంచనాలు పెంచుతోంది

Vijay Sethupathi: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమిళ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా కాలం క్రితమే స్టార్ట్ అయ్యింది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ క్రేజీ సినిమా నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.

Mega Letter: ఓయ్ ప్రసాదూ.. ఇదిగో నిన్నే.. మెగాస్టార్ కి ఓ అభిమాని మెగా లేఖ

ఈ సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్ లో విజయ్ సేతుపతి చేతిలో కత్తితో కనిపిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాలో విజయ్ బిచ్చగాడిగా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

Vijay sethupathi Slum dog movie first look released (1)

Vijay sethupathi Slum dog movie first look released (1)