Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో ఆడుకుంటున్న నెట్‌ఫ్లిక్స్.. పుష్ప 2 ఓటీటీ రిలీజ్ పై మళ్ళీ కన్ఫ్యూజన్..

పుష్ప 2 ఓటీటీ రిలీజ్ విషయంలో అభిమానులతో ఆడుకుంటున్న నెట్ ఫ్లిక్స్.. పొద్దునేమో అలా.. ఇప్పుడేమో ఇలా..

Netflix New Update on Allu Arjun Pushpa 2 Movie OTT Release Date Fans Gets Confused

Pushpa 2 : అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 సినిమా గత నెల డిసెంబర్ 5న థియేటర్స్ లో రిలీజయింది. నార్త్ లో మాత్రం అక్కడి ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఆల్మోస్ట్ 1900 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఆల్రెడీ బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టేసింది. ఈ సినిమా రిలీజయి 50 రోజులు దాటుతున్నా ఇంకా పలు థియేటర్స్ లో ఆడుతుంది.

అయితే ఇటీవల ఎంత హిట్ సినిమా అయినా, స్టార్ హీరో సినిమా అయినా రిలీజయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. పుష్ప 2 సినిమా మాత్రం 50 రోజులు అయినా రాలేదు. పుష్ప 2 ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ నిర్మాణ సంస్థ కొనుక్కుంది. నేడు నెట్ ఫ్లిక్స్ లో పుష్ప 2 సినిమా జనవరి 30 గురువారం నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు పెట్టేసారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

Also Read Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే పరువాలు.. మోడ్రన్ డ్రెస్ లో మత్తెక్కిస్తూ..

అయితే మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు కానీ నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియాలో.. డేట్ చెప్పకుండా పుష్ప 2 త్వరలో వస్తుందని ప్రకటించింది. బ్రాండ్ పుష్ప రూల్ మొదలుకానుంది. పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్, 23 నిముషాలు జత చేసిన వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే రానుంది అని ప్రకటించింది.

దీంతో నెట్ ఫ్లిక్స్ తాజా ప్రకటనతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనవరి 30న స్ట్రీమింగ్ అని చెప్పి మళ్ళీ త్వరలో అని పోస్ట్ వేయడంతో తికమక పడుతున్నారు. నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్స్ తో ఆడుకుంటుంది అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని గందరగోళంలో పడ్డారు ఫ్యాన్స్. ఇప్పుడు కేవలం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అని చెప్పడంతో ఒకవేళ ఓటీటీలోకి వచ్చినా హిందీలో మాత్రం ఇప్పుడే రాదని తెలుస్తుంది. హిందీలో ఈ సినిమా ఇంకా బాగా ఆడుతుండటంతో మరిన్ని రోజులు అక్కడ థియేటర్స్ లో ఆడిన తర్వాతే అప్పుడు హిందీ వర్షన్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని సమాచారం.

Also Read : Deepthi Sunaina : కొత్త టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఏం వేయించుకుందో చూశారా? ఆ టాటూ అర్ధం ఏంటంటే..

ఇటీవల రీ లోడెడ్ వర్షన్ అని ఇంకో 20 నిముషాలు జత చేసి జనవరి 17న మళ్ళీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది మిస్ అయినవాళ్లు ఓటీటీలో రీ లోడెడ్ వర్షన్ వస్తే చూద్దామని ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చేసిన పుష్ప 2 సినిమా ఓటీటీలోకి వచ్చాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.