Deepthi Sunaina : కొత్త టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఏం వేయించుకుందో చూశారా? ఆ టాటూ అర్ధం ఏంటంటే..
దీప్తి సునైనా కొత్త టాటూ చూశారా..

Deepthi Sunaina Shares Her New Tattoo Video goes Viral
Deepthi Sunaina : టిక్ టాక్, రీల్స్ తో ఫేమ్ తెచ్చుకొని సెలబ్రిటీ అయిపొయింది దీప్తి సునైనా. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ లో పాల్గొని బాగా వైరల్ అయింది దీప్తి. అనంతరం యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది ఈ భామ.
ఇప్పటికే దీప్తికి కొన్ని టాటూలు ఉండగా తాజాగా ఓ కొత్త టాటూని వేయించుకుంది. దానికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఎడమ చేతిపై ఈ కొత్త టాటూని వేయించుకుంది. ఈ టాటూ.. శివుడు నడుస్తుంటే ఆయన వెంట ఓ అమ్మాయి అనుసరిస్తున్నట్టు ఉంది. ఆ అమ్మాయి తనే అని చెప్పింది. ఆయన నడిచే దారిలో, ఆయన నడిపించే దారిలో వెళ్తాను, శివయ్య ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అని అర్ధం వచ్చేలా ఆ టాటూ ఉంది. దీంతో దీప్తి కొత్త టాటూ వైరల్ గా మారింది.
Also See : జ్వరం, దగ్గుతోనే తండేల్ డబ్బింగ్ చెప్తున్న సాయి పల్లవి.. డైరెక్టర్ ఆటపట్టిస్తూ.. వీడియో చూశారా?
ఇక దీప్తి సునైనా తన షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్, బిగ్ బాస్ తోనే కాక షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం నడిపి కూడా వైరల్ అయింది. కొన్నాళ్ళు ఇద్దరూ కలిసి సాంగ్స్ చేసారు, ప్రేమాయణం నడిపారు. ఇద్దరూ వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ లో పాల్గొన్నారు. షన్ను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరు విడిపోయినట్టు అధికారికంగానే ప్రకటించారు. బిగ్ బాస్ వల్లే వీరిద్దరూ విడిపోయారు అని కూడా రూమర్స్ వచ్చాయి.
Also Read : వెంకీమామ హిట్టు సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకింగ్ వీడియో చూశారా?
మరో వైపు దీప్తి ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. కానీ తను హీరోయిన్ గా ట్రై చేస్తుందని, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చినా నో చెప్తుందని తెలుస్తుంది. మరి దీప్తి సునైనా హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.