×
Ad

Tere Ishq Mein OTT: ఓటీటీలో బ్లాక్ బస్టర్ ‘తేరే ఇష్క్ మే’.. ధనుష్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ధనుష్ 'తేరే ఇష్క్ మే(Tere Ishq Mein OTT)' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.

Netflix official announcement on Tere Ishq Mein movie ott streaming.

  • ఓటీటీలోకి ధనుష్ హిట్ మూవీ ‘తేరే ఇష్క్ మే’
  • అధికారిక ప్రకటన చేసిన నెట్ ఫ్లిక్స్
  • జనవరి 23 నుంచి స్ట్రీమింగ్

Tere Ishq Mein OTT: రాంఝాణా, అత్రంగి రే లాంటి సూపర్ హిట్స్ తరువాత ధనుష్ బాలీవుడ్ లో చేసిన మరో మూవీ ‘తేరే ఇష్క్ మే(Tere Ishq Mein OTT)’. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. 2025 నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ధనుష్ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

Kangana Ranaut: ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి.. రహమాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా

దీంతో ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇదే సినిమాను ‘అమర కావ్యం’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు మేకర్స్. కానీ, ఇక్కడ ఆడియన్స్ ఈ సినిమాకు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. అయితే, తాజాగా థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘తేరే ఇష్క్ మే’ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.