Kangana Ranaut: ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి.. రహమాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా

సినిమా ఇండస్ట్రీలో విభజనవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అంటూ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చిన కంగనా(Kangana Ranaut).

Kangana Ranaut: ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి.. రహమాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా

Kangana Ranaut responded to Rahman's controversial comments.

Updated On : January 18, 2026 / 10:43 AM IST
  • సినిమా ఇండస్ట్రీలో విభజనవాదం అంటూ రహమాన్ సంచనల కామెంట్స్
  • మండిపడుతున్న ప్రముఖులు
  • నీ అంత ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు అంటూ కంగనా పోస్ట్

Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీలో విభజనవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అంటూ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన మతం కారణంగా గతం పదేళ్లుగా పని దొరకడం లేదని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు రహమాన్. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉందని, తనను ఎంపిక చేసిన తరువాత వేరే వాళ్ళతో సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలణంగా మారింది.

Sara Arjun: హాఫ్ శారీలో సారా అర్జున్ గ్లామర్.. క్యూట్ ఫొటోలు వైరల్

రహమాన్ చేసిన ఈ వివాదాస్పద కామెంట్స్ పట్ల దేశ ప్రజలు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు రహమాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ లిస్టులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, వీహెచ్పీ నేత వినోద్ బన్సల్ తదితరులు ఉన్నారు. రహమాన్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రెహమాన్.. నేను కేవలం కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని తెలిసి సినీ పరిశ్రమలో నాపై ఎంతో వ్య‌తిరేకత‌ను చూపించారు. కానీ, మీ అంత ప‌క్ష‌పాత, ద్వేషపూరితమైన వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కంగన(Kangana Ranaut).

బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉంది అనడం అవాస్తవం. షారూఖ్ ఖాన్, సల్మాన్‌ ఖాన్ లాంటి స్టార్ హీరోలు ఇక్కడే కొనసాగుతున్నారు. రెహమాన్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. చిన్న నిర్మాతలు ఆయన దగ్గర వెళ్ళలేరు. మత పరమైన కారణాలు కాదు’ అంటూ జావేద్ అక్తర్ చెప్పుకొచ్చాడు. దీంతో, రహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి.