×
Ad

Telusu Kada OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘తెలుసు కదా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". యూత్ అండ్ (Telusu Kada OTT)ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ కాస్త్యుమ్ డిజైనర్ నీరజ కోన తెరకెక్కించారు.

Netflix officially announced Ott streaming date of telusu kada movie

Telusu Kada OTT: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ “తెలుసు కదా”. యూత్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ కాస్త్యుమ్ డిజైనర్ నీరజ కోన తెరకెక్కించారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా వచ్చిన ఈ సినిమా దీపావళి కనుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత మాత్రం అంతగా ఆకట్టుకోలేదు(Telusu Kada OTT) అనే చెప్పాలి. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమాలోని ఎమోషన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యారు, కానీ, కొంతమంది మాత్రం రొటీన్ కథ అని కామెంట్స్ చేశారు.

Divvala Madhuri: వాడసలు మనిషే కాదు.. అందులో వల్గారిటీ ఏముంది.. భరణి ట్రోల్స్ పై మాధురి షాకింగ్ కామెంట్స్

దీంతో సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు అనే చెప్పాలి. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ చాలా రోజులగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తెలుగు కదా సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 13 నుంచి ఓటీటీలో ప్రసారం చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్స్ లో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.