New Anchor in Jabadasth Show along with Rashmi Promo goes Viral
Jabardasth : తెలుగు ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా నవ్విస్తున్న షోలలో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ వచ్చిన దగ్గర్నుంచి ఎన్నో ఛేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. యాంకర్లు మారారు, టీమ్ లీడర్స్ మారారు, చాలా మంది కొత్త కమెడియన్స్ వచ్చారు, జడ్జీలు మారారు, రెండు షోలుగా మారింది, మళ్ళీ ఒకే షో రెండు వారాలుగా మారింది.. ఇలా జబర్దస్త్ లో నిత్యం ఏదో ఒక ఛేంజెస్ జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా మరికొన్ని మార్పులు చేసి సరికొత్తగా జబర్దస్త్ అంటూ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సారి కొంతమంది సీరియల్స్ వాళ్ళను కూడా తీసుకువచ్చారు, కొత్త టీమ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే షోలో లైవ్ లో ఆడియన్స్ ని కూడా తీసుకొచ్చారు. అన్నిటికంటే మెయిన్ ఈసారి జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ వచ్చారు. ఇన్నాళ్లు అమ్మాయిలే యాంకరింగ్స్ చేస్తూ వచ్చారు. మొదటిసారి జబర్దస్త్ కి ఒక అబ్బాయిని యాంకర్ గా తెచ్చారు.
Also Read : Express Hari – Ashu Reddy : షోలో అషురెడ్డి కాలు పట్టుకున్న ఎక్స్‌ప్రెస్ హరి.. ఏం చేసాడంటే.. ప్రోమో వైరల్..
అయితే యాంకర్ రష్మీ కూడా ఉంటుంది. ఇద్దరు యాంకర్స్ తో ఇకపై షో సాగనుందని తెలిపారు. ఇంతకీ ఆ కొత్త యాంకర్ ఎవరో అనుకుంటున్నారా? సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉన్న మానస్ ని కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. మానస్ ఎంట్రీతో రష్మీ ఆశ్చర్యపోయింది.
మానస్ రాగానే.. తెల్లతోలు కదా, స్టైలిష్ గా ఉంటుంది కదా అనుకునేవు మాస్ ఇక్కడ మాస్ పిల్ల అని సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దీనికి మానస్ కౌంటర్ ఇస్తూ.. నువ్వు మాస్ అయితే నేను మానస్ ఊర మాస్ ఇక్కడ అని అన్నాడు. ఇకనుంచి రష్మీ – మానస్ ఇద్దరు యాంకర్స్ తోనే జబర్దస్త్ షో సాగుతుందని తెలుస్తుంది. మీరు కూడా లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో చూసేయండి..
Also Read : Samyuktha : వామ్మో.. సైలెంట్ గా దూసుకుపోతున్న ‘సంయుక్త’.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?