Currency Nagar Review : ‘కరెన్సీ నగర్’ సినిమా రివ్యూ.. ఆంథాలజీ జానర్‌లో..

కరెన్సీ నగర్ సినిమా ఆంతాలజీ థ్రిల్లర్ గా నేడు డిసెంబర్ 29న థియేటర్స్ లోకి వచ్చింది.

New Anthology Movie Currency Nagar Review and Rating

Currency Nagar Review : ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మాణంలో వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కరెన్సీ నగర్. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ కరెన్సీ నగర్ సినిమా ఆంతాలజీ థ్రిల్లర్ గా నేడు డిసెంబర్ 29న థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. సత్య (సుదర్శన్)కు ఐదు లక్షల రూపాయలు అవరసం అవుతాయి. దొంగతనం చేసి అయినా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకొని అక్కడికి వెళతాడు సత్య. అక్కడ మాట్లాడే ఒక ఇనుప పెట్టలో బంగారం ఉంటుంది. ఆ బంగారం తీసుకోవాలనే క్రమంలో ఇనప పెట్ట సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ, మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పుల గురించి ఉంటాయి. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు? సత్యకు ఎందుకు డబ్బు అవసరం పడింది? అతనికి ఐదు లక్షలు దొరికాయా? నిజంగానే ఇనప పెట్టె మాట్లాడిందా? ఆ మూడు కథలు ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఇనప పెట్టె మాట్లాడటం, బంగారం కోసం వెళ్లడం ఇదంతా ఆసక్తిగా సాగుతుంది. ఇక ఆంథాలజీ జానర్ లో చెప్పిన మూడు కథలు కూడా మేపిస్తాయి. కేశవ, చాందిని ఎపిసోడ్ సినిమాకు వర్కౌట్ అయ్యింది. మరో కథలో అమ్మ క్యారెక్టర్ మెప్పిస్తుంది. మానవ విలువలు, ప్రేమ అంశాలపై సన్నివేశాలు హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అవుతాయి. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆంథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఆ జానర్ లో వచ్చి ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది చెప్పొచ్చు.

Also Read : Devil Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..

నటీనటులు, సాంకేతిక అంశాలు.. సుదర్శన్, యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని.. ఇలా ప్రతి ఒక్కరు కథకు తగ్గట్టు వారి పాత్రల మేరకు బాగా నటించారు. నిర్మాతలు చిన్న సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు వెన్నెల కుమార్ కూడా మొదటి సినిమానే ఆంథాలజీ జానర్ తీసుకొని సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కథనం కూడా ఆసక్తిగా సాగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు పర్వాలేదనిపిస్తాయి.

మొత్తంగా కొత్త కొత్త కథలు కలిసి ఉన్న ఆంథాలజీ జానర్ లో సినిమా తెరపై చూడాలంటే కరెన్సీ నగర్ చూడాల్సిందే.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ పూర్తిగా విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.