Chaitanya-Sobhita : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కొత్త జంట నాగచైతన్య, శోభిత.. ఫోటో వైరల్..

నాగ చైతన్య, శోభిత గత రెండేళ్ల డేటింగ్ అనంతరం తాజాగా వివాహం చేసుకున్నారు.

New couple Naga Chaitanya and Sobhita visited Srisailam Mallanna temple

Chaitanya-Sobhita : నాగ చైతన్య, శోభిత గత రెండేళ్ల డేటింగ్ అనంతరం తాజాగా వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల ముహూర్తానికి నాగ చైతన్య, శోభిత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఏఎన్నార్ గారి శత జయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించబడిన ఏఎన్నార్ విగ్రహం ముందు శోభిత కి తాళి కట్టాడు చైతన్య.

Also Read : Keerthy Suresh : స్టార్ హీరో బర్త్ డే రోజు కీర్తి సురేష్ పెళ్ళి.. గోవాకు చెక్కేసిన మహానటి..

అయితే వీరి పెళ్లి జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్త జంట శ్రీశైలం మల్లన్న ఆలయానికి వెళ్లారు. నూతన దంపతులు మల్లన్న సేవలో ఉన్నారు. కొత్త జంట నాగ చైతన్య, శోభితలతో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం శ్రీశైలంలో కనిపించారు. శ్రీశైలంలో ఉన్న మల్లన్న, అమ్మవారిని దర్శించుకున్నారు అక్కినేని కుటుంబం.

 

అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం చేశారు కొత్త జంట. పూజ అయిపోయిన తర్వాత వేదమంత్రాల ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం వారి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.