Keerthy Suresh : స్టార్ హీరో బర్త్ డే రోజు కీర్తి సురేష్ పెళ్ళి.. గోవాకు చెక్కేసిన మహానటి..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.

Keerthy Suresh getting married on the day of that star hero birthday
Keerthy Suresh : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే తనకి కాబోయే భర్త ఎవరో కూడా తెలిపింది. అంతేకాదు ఇప్పటికే ఆమె పెళ్లి ఎక్కడ చేసుకోబోతుందో కూడా చెప్పేసింది. అయితే తాజాగా తన పెళ్లి పనులు స్టార్ట్ చేసినట్టుగా ఓ అదిరిపోయే పోస్ట్ షేర్ చేసింది.
తాజాగా కీర్తి తన సోషల్ మీడియా వేదికగా.. ‘KA వెడ్డింగ్ మొదలవుతుంది’ అని గోవా ఫ్లైట్ టికెట్స్ ఫోటోలని షేర్ చేసింది. ఇప్పటీకే కీర్తి.. నా పెళ్లి గోవా లో చేసుకుంటున్న అని క్లారిటీ కూడా ఇచ్చింది. డిసెంబర్ 12న వీరి వివాహం జరగనుంది. తమిళ స్టార్ హీరో రజినీకాంత్ పుట్టిన రోజు నాడే వీరి వివాహం జరగడం విశేషం. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుందని సమాచారం. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్‌ను వివాహమాడనుంది ఈమె. దాదాపు 15 ఏళ్లుగా కీర్తి సురేష్, ఆంటోనీ తటిల్ మంచి స్నేహితులు.
Also Read : Aishwarya Rai-Abhishek Bachchan : ఒక్క ఫొటోతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ కపుల్..
ఇక ఇప్పుడు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పింది కీర్తి. ఇక కీర్తి సురేష్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది.