Delulu Teaser : ‘డెలులు’ టీజర్ రిలీజ్..
మీరు కూడా డెలులు టీజర్ చూసేయండి.. (Delulu Teaser)
Delulu Teaser
Delulu Teaser : విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డెలులు. క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మాణంలో ప్రీతం కస్తూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జెన్ జీకి తగ్గ టైటిల్ తో ఈ సినిమాపై ఆసక్తి నెలకొల్పేలా చేసారు.
జెన్ జీ యూత్ ని టార్గెట్ చేసే ఫన్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ డెలులు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్.. బ్రేకప్ దేవా.. అనే డైలాగ్‌తో మొదలయి పంచ్ లు, లవ్ డైలాగ్స్ తో అమ్మాయిలు – అబ్బాయిలు మధ్య సాగింది.
Also See : Amrutha Chowdary : నలుపు చీరలో అదరగొడుతున్న అమృత చౌదరి.. ఫొటోలు..
మీరు కూడా డెలులు టీజర్ చూసేయండి..
