New Movie
New Movie : వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ వినోద్ ఫిలిం అకాడమీ అండ్ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై కొత్త చిత్రాన్ని ప్రకటించారు. వినోద్ కుమార్ నువ్వుల హీరోగా, నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ లో సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ క్లాప్ కొట్టగా, డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజశేఖర్ ఆనింగి, డాక్టర్ సుధాకర్, ప్రొఫెసర్ విల్సన్, కిషోర్ దాస్, బబ్లూ, జబర్ధస్త్ జీవన్, స్వప్న చౌదరి, పృథ్వీ.. పలువురు ఈ ఓపెనింగ్ లో పాల్గొన్నారు.
సినిమా ఓపెనింగ్ అనంతరం ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. పరిశ్రమలోకి వేలమంది వస్తుంటారు కానీ సరైన శిక్షణ లేక వెనకబడిపోతుంటారు. వినోద్ కుమార్ నువ్వుల తన అనుభవంతో విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయం. ఆయన హీరోగా అచేస్తున్న ఈ సినిమా అవిజయం సాధించాలి అని అన్నారు.
Also Read : Peddi : ఏకంగా పీఎం ఆఫీస్ లో పెద్ది షూటింగ్..? ఢిల్లీలో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడ్రా బాబు..
నిర్మాత, హీరో వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ.. వినోద్ ఫిల్మ్ అకాడమీ నా కల. సినిమాపై మక్కువతో హైదరాబాద్ వచ్చే యువత సరైన మార్గదర్శకత్వం లేక ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో 5 ఏళ్ళ క్రితం ఈ అకాడమీని ప్రారంభించాను. ఈ అకాడమీ విద్యార్థులు రేపు ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరు తెచ్చుకుంటారు. శిక్షణ ఇవ్వడమే కాకుండా నా విద్యార్థుల ప్రతిభను వెండితెరపై చూపించాలనే ఉద్దేశంతోనే వినోద్ ఫిలిం అకాడమీ అండ్ స్టూడియోస్ బ్యానర్ స్థాపించి సినిమా మొదలుపెట్టాను అని తెలిపారు.