Peddi : ఏకంగా పీఎం ఆఫీస్ లో పెద్ది షూటింగ్..? ఢిల్లీలో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడ్రా బాబు..

పెద్ది సినిమా మార్చ్ 27 రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. (Peddi)

Peddi : ఏకంగా పీఎం ఆఫీస్ లో పెద్ది షూటింగ్..? ఢిల్లీలో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడ్రా బాబు..

Peddi

Updated On : December 24, 2025 / 9:12 AM IST

Peddi : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.(Peddi)

ఇప్పటికే పెద్ది సినిమా నుంచి ఓ సాంగ్, టీజర్ రిలీజ్ అయి భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ లో క్రికెట్ షాట్, చికిరి చికిరి సాంగ్ స్టెప్ బాగా వైరల్ అయ్యాయి. పెద్ది సినిమా మార్చ్ 27 రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

Also Read : Inaya Sulthana : 3 రోజెస్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన బిగ్ బాస్ భామ.. ఇనయా సుల్తానా ఫొటోలు..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లోలో జరుగుతుంది. ఢిల్లీలో భారీగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు, ఏపీ భవన్, పార్లమెంట్ బయట వీధుల్లో, ఇండియా గేట్ వద్ద షూటింగ్ చేస్తున్నారట. అలాగే పీఎం ఆఫీస్ లో కూడా షూటింగ్ చేస్తున్నారట. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీ – ప్రధానమంత్రి సంగ్రహాలయలో కూడా షూటింగ్ చేస్తున్నారని సమాచారం.

ఆల్రెడీ రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీని సందర్శించి అక్కడ అధికారులను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RRR సినిమాతో రామ్ చరణ్ కి నార్త్ లో బాగా పేరొచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెద్ది షూటింగ్ జరుగుతుండటంతో భారీగా జనాలు చరణ్ ని చూడటానికి వచ్చారు. అక్కడి పోలీసులు కూడా చరణ్ తో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.

Also Read : Jabardasth Mahidhar : ఆరేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. పెళ్లి ఫొటోలు వైరల్..

ఢిల్లీలో షూట్ చేయడం, ఏకంగా ఢిల్లీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేయడం, పీఎం ఆఫీస్ లో షూటింగ్ పెట్టడంతో బుచ్చిబాబు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఢిల్లీ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.