అప్పుడు వద్దన్నవారే.. ఇప్పుడు ముద్దంటున్నారు మరి!

OTT Movies: టీవీల్లో సినిమాలు ఎవరు చూస్తారు అని అనుకున్న వాళ్లకి ఇప్పుడు అదే ప్రపంచం అయ్యింది. ఏదో చిన్న చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటారు కానీ.. పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకు థియేటర్లుకావల్సిందే.. అని గోల పెట్టారు. కానీ పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
థియేటర్లుఓపెన్ చేసినా, సినిమా రిలీజ్ చేసినా.. జనాలు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లవైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. ‘గురు’ ఫేం సుధ కొంగర డైరెక్షన్‌లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన Soorarai Pottru చిత్రం తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో నవంబర్ 12 నుంచి ఆడియన్స్‌కి ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయాలని తమిళనాడు సినీ పరిశ్రమలో కొందరు వివాదం చేసినా, వాళ్లందరినీ ఎదిరించి, ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు సూర్య. ఎయిర్ డెక్కన్ వ్యవస్తాపకుడు జిఆర్. గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్యకి జంటగా అపర్ణా బాలమురళి నటించగా మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేశ్ రావల్, సంపత్ రాజ్ ముఖ్యమైన రోల్స్‌లో నటించారు.
సౌత్ నుంచే కాదు.. మొన్నీ మధ్య బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఓటీటీలోనే తన సినిమా రిలీజ్ చేశారు. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో అక్షయ్, కియారా అద్వానీ జంటగా నటించిన మూవీ Laxmii (లక్ష్మీబాంబ్) ఈ సినిమా నవంబర్ 9 న ఓటీటీ లోనే రిలీజ్ అయ్యింది. కామెడీ హార్రర్ థ్రిల్లర్‌గా తెరెకెక్కిన ఈ సినిమా సౌత్‌లో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ సినిమాకిది రీమేక్‌గా రిలీజ్ అయ్యింది.
ఈ హీరోలతో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ‘నిశబ్దం’ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. లాక్‌డౌన్‌కు ముందే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా గ్యాప్ తీసుకుని అక్టోబర్ 2 న ఆడియన్స్ ముందుకొచ్చింది. మల్టీలింగ్వల్‌గా థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క, ఆర్. మాధవన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు.
ఇక టాలీవుడ్‌కి సంబంధించి నేచురల్ స్టార్ నాని లాంటి స్టార్ కూడా ఓటీటీనే అప్రోచ్ అయ్యారు. నాని, సుధీర్ బాబు లీడ్ రోల్స్‌లో నటించిన ‘వి’ సినిమాని కూడా సెప్టెంబర్ 5 న స్మాల్ స్క్రీన్‌లోనే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో కంటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఆడియన్స్‌కి తనలోని కొత్త యాక్టింగ్ యాంగిల్ చూపించాడు నాని. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నాని విలన్‌గా వస్తున్న ఈ ‘వి’ సినిమాని ఓటీటీలోనే ఎక్స్‌పీరియన్స్ చేశారు ఆడియన్స్. ఇలా చిన్న స్టార్లే కాకుండా పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు కూడా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నాయి.