Child Artist
Child artists : సాధారణంగా అన్ని భాషల్లోనూ చాలా వరకు ప్రతి సినిమా, సీరియల్స్ లో బాల నటినటులు ఉంటారు. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో అయితే కీలక పాత్రధారులుగా చైల్డ్ ఆర్టిస్ట్ లే ఎక్కువగా ఉంటారు. తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ ల విషయంలో తెలంగాణ కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ కార్మిక శాఖ బాల కార్మికుల కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే చైల్డ్ ఆర్టిస్ట్ ల బవిషయంలోనూ కొన్ని రూల్స్ పెట్టింది. ఇప్పుడు ఈ రూల్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి భారం అవ్వనున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సినిమాల్లో, సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉంటే పెద్దగా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు. కానీ తాజాగా తెలంగాణ కార్మిక శాఖ కొత్త రూల్స్ పెట్టింది. 14 సంవత్సరాలలోపు పిల్లలు ఏ రంగాల్లోను పని చేయకూడదు అంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒకవేళ సినిమాలో నటించాలి అని ఆసక్తి ఉన్న బాల నటులకి సినిమా అవకాశాలు వస్తే కలెక్టర్ నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమా నిర్మాత కానీ దర్శకుడు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Balakrishna : బాలయ్య నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారుగా..
అంతేకాక సినిమాలో ఫలానా బాల నటుడు నటిస్తాడు అని దర్శక నిర్మాతలు ఎవరో ఒకరు కలెక్టర్ కు సమాచారం ఇవ్వడమే కాక సంబంధిత చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో నటించడం తనకు ఇష్టమే అని హామీపత్రం ఇవ్వడం లేదా కలెక్టర్ ముందు చెప్పడం కానీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మరో రూల్ కూడా పెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇచ్చే పేమెంట్ లో ఒక ఇరవై ఐదు శాతం పేమెంట్ ఒక జాతీయ బ్యాంకులో ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన డబ్బును ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరెంట్స్ లేదా గార్డియన్స్ కు అందజేయాల్సి ఉంటుంది. వీటితో పాటు వారి చదువుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కొత్త రూల్స్ ని పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్ని రూల్స్ అంటే సినిమా యూనిట్ పై వర్క్ పరంగా మరింత భారం పడనుందని అంటున్నారు.
Pushpa : ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై దాడి చేసిన ఫ్యాన్స్