Balakrishna : బాలయ్య నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారుగా..
బాలయ్య 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి........

Balayya
Balakrishna : బాలయ్య బాబు ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. ఇటీవల ‘అఖండ’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన సినిమాల్లో భారీ హిట్ గా నమోదయింది. దేశ విదేశాల్లోనూ ‘అఖండ’ మానియా కొనసాగింది. 100 కోట్ల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి దూసుకుపోతుంది అఖండ. ఇదే జోష్ లో నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు బాలయ్య.
బాలయ్య 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘క్రాక్’ సినిమాతో భారీ విజయం సాధించిన గోపీచంద్ ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా తీయబోతున్నాడు. అది కూడా బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పటికే ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సంక్రాంతి తర్వాత జనవరి 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరగనుంది.
Pushpa : ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై దాడి చేసిన ఫ్యాన్స్
ఈ సినిమా స్టోరీ కూడా లీక్ అయినట్టు సమాచారం. ఇందులో తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో జరిగే ఫ్యాక్షన్ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ గాను, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గాను కనిపించనున్నారని సమాచారం. ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య బాబు ఎన్నో హిట్స్ కొట్టారు. మరోసారి చాలా గ్యాప్ తర్వాత బాలయ్య ఫ్యాక్షన్ సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Trivikram Srinivas : త్రివిక్రమ్ భార్య నృత్య ప్రదర్శన.. స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్
ఇందులో మరో హీరోయిన్ గా భావనను, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకి ‘వేటపాలెం’ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నారట. మైత్రి మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని, బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మి శరత్ కుమార్.. ఇలా అందరు హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉండటంతో సినిమాపై అంచనాలు చాలానే నెలకొన్నాయి.