New strategy of Tollywood top heroes
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ వారం ఏదో ఒకటి మూవీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకే ఓ రేంజ్ ఉంటుంది. ఇదే స్ట్రాటజీతో పోటీ పడి మరీ.. పొంగల్ బరిలోకి దిగుతారు ప్రొడ్యూసర్లు. ఒకేసారి రెండు, మూడు మూవీస్ రిలీజ్ అవడం.. నెగెటివ్ టాక్‌తో ఏదో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కామన్ అయిపోయింది. అందుకే రూటు మార్చాలనుకుంటున్నారట టాలీవుడ్ టాప్ హీరోలు.
సంక్రాంతి బరిలో కాకుండా..సోలోగా ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారట. అందుకోసం పుష్ప-2ను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారట. హాలీడేస్ వస్తే చాలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంటారు స్టార్ హీరోలు. అప్పుడైతే వసూళ్లు బాగా వస్తాయనుకుంటారు. సమ్మర్ అయిన, సంక్రాంతి అయిన, దసరా అయిన, ఆఖరికి దీపావళి, క్రిస్మస్ అయినా సరే..ఏదో ఒక స్పెసిఫిక్ అకేషన్ చూసుకుని సినిమాలను రిలీజ్ చేస్తుందటారు. ఇదే ఇప్పుడు పెద్ద మైనస్ అవుతుందంటున్నారట.
Daaku Maharaaj Release Trailer : బాలయ్య ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
హాలీడేస్ ఉన్నప్పుడు, పండుగుల సీజన్‌లో ఒకేసారి ఇద్దరు, ముగ్గురు స్టార్స్ సినిమాలు రిలీజ్ అయితే..అసలుకే మోసం వస్తుందని జాగ్రత్త పడుతున్నారట. ఒక్క షోకే నెగిటివ్ టాక్ వస్తే ఇక మరో షోకి థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని..అసలు కలెక్షన్స్ రావటం లేదట. తమ హాడ్ వర్క్, టైమ్ వేస్ట్ అవుతున్నాయని స్టార్ హీరోలు ఫీల్ అవుతున్నారట. పుష్ప-2 డిసెంబర్ 5 న రిలీజ్ అయింది. అప్పుడు హాలీడేస్ లేవు. అయినా కూడా 2 వేల కోట్లకు రీచ్ అవుతుంది. అందుకే సోలోగా రావటమే మంచిదని, ఇలా అందరూ కలసి ఒకేసారి వచ్చి నష్టపోవటం తప్ప మరొకటి లేదంటున్నారు.
ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలర్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. అయితే సంక్రాంతికి కాకుండా..ఏ మూవీ కాంపిటీషన్ లేనప్పుడు సోలోగా రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లకు చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ..ఇలా స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం కాస్త బెటరేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Game Changer : ‘నానా హైరానా’ పాట ఎక్కడ..? మూవీలో లేని సాంగ్.. టీమ్ ఏమన్నదంటే..?