వయస్సుతో పనేముంది : ప్రియాంక వయస్సు 37..అయితే – నిక్ జోనస్

  • Publish Date - February 28, 2020 / 01:09 PM IST

వయస్సుతో పనేముందు అంటున్నారు బాలీవుడ్ నటి ప్రియాంక భర్త..నిక్ జోనస్. వయస్సులో తనకన్నా పదేళ్లు చిన్నావాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని ప్రేమకు వయస్సుతో పని లేదని నిరూపించారు. తాజాగా తమ మధ్యనున్న ఏజ్ గ్యాప్‌పై స్పందించారు నిక్. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. నిక్..జోనాస్ బ్రదర్స్ ట్రూప్ తరపున మ్యూజికల్ టూర్స్‌తో బిజీగా ఉండిపోయాడు.

‘ది వాయిస్ సీజన్ 18’ లోకి ఎంటరవుతున్నాడు. కోచ్‌లలో ఒకరైన నిక్..భార్య ప్రియాంక..మధ్యనున్న వయస్సు తేడా గురించి మాట్లాడారు. ఆమె వయస్సు 37 అంటూ తోటి కోచ్, గాయకుడు కెల్లీకి బదులిచ్చాడు. గతంలో వీరి వివాహం సమయంలో వయస్సుపై చర్చకు వచ్చింది. దీనిపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ప్రియాంక. 

2018లో వీరి వివాహం జరిగింది. క్రైస్తవ, హిందూ ఆచారాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే..వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. తమ సొంత సంగీత్ సెర్మనీని స్పూర్తిగా తీసుకుని..ఎంపికైన నిశ్చితార్థం చేసుకున్న జంటలు ఇందులో కనిపించబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా ప్రియాంక వెళ్లడించారు. 
వీరి మధ్యనున్న ఉన్న ప్రేమానురాగాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు.

వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటాయి. ది స్కై ఈజ్ పింక్ చిత్రం ద్వారా నటి ప్రియాంక మంచి విజయాన్ని అందుకున్నారు. వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. నిక్ జోనస్ కీలక పాత్రలో నటించిన చిత్రం జుమాంజీ : ది నెక్ట్స్ లెవల్. చిత్రం బాక్సాపీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో నిక్ కూడా నటించాడు. 2019లో మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈ నటి..ఈ ఏడాది కూడా అదే ఊపు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.