Nidhhi Agerwal
Nidhhi Agerwal : చాలామంది ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా ఆల్కహాల్ తాగుతారు. హీరోయిన్స్ కూడా ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ తన ఆల్కహాల్ అలవాటు గురించి చెప్పుకొచ్చింది. ఇటీవల సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో నిధి అగర్వాల్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆల్కహాల్ అలవాటు గురించి మాట్లాడింది.(Nidhhi Agerwal)
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నేను 14 ఏళ్ళ వయసు నుంచే ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి ఆల్కహాల్ తాగడం ఫన్ గా ఉండేది. అప్పట్లో ఆల్కహాల్ తాగుతూ బాగా ఎంజాయ్ చేసాము. అప్పట్లో అది సరదాగా ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆల్కహాల్ నాకు పడలేదు. నాకు ఆల్కహాల్ పడదు అని అర్థమైంది. నా బాడీకి కూడా మందు పడట్లేదని తెలిసింది. అది తెలిసాక నేను మందు తాగడాన్ని ఆస్వాదించలేకపోయాను.
దాంతో తాగింది చాలు ఇంక మందు మానేద్దాం అని మెల్లిగా నేను మందు మానేశా. నేను చివరగా ఆల్కహాల్ తాగి ఆరేళ్ళు అయింది. అప్పట్నుంచి ఆల్కహాల్ పార్టీలకు వెళ్లడం మానేశా. గత కొన్నాళ్లుగా మళ్ళీ పార్టీలకు వెళ్తున్నాను కానీ మందు తగ్గట్లేదు. నా ఫ్రెండ్స్ మందు తాగితే నేను గ్రీన్ టీ తాగుతాను ఆ సమయంలో అని తెలిపింది. మొత్తానికి లేట్ అయినా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకుంది నిధి అగర్వాల్. ఈ విషయంలో నిధిని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.