Anil Ravipudi : చంద్రబాబు అరెస్ట్ అవ్వడం వల్ల.. ఆ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్..

మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (Anil Ravipudi)

Anil Ravipudi : చంద్రబాబు అరెస్ట్ అవ్వడం వల్ల.. ఆ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్..

Anil Ravipudi

Updated On : January 21, 2026 / 3:39 PM IST
  • మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్
  • అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ
  • చంద్రబాబు అరెస్ట్ పై కామెంట్స్

Anil Ravipudi : ఇటీవల వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో కలిపి వరుసగా 9 హిట్లు కొట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్. అయన అన్ని సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటాయి. మధ్యలో ఒక్క భగవంత్ కేసరి తప్ప. భగవంత్ కేసరి సినిమాలో కాస్త కామెడీ ఉన్నా ఒక మెసేజ్ తో కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు.(Anil Ravipudi)

బాలకృష్ణ హీరోగా కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా 2023 దసరా సమయంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమానే తమిళ్ స్టార్ హీరో విజయ్ రీమేక్ కూడా చేసాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కానీ అనిల్ రావిపూడి మిగతా సినిమాల రేంజ్ లో పెద్ద విజయం సాధించలేదు.

Also See : Nehaa Pathan : కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన నేహా పఠాన్.. క్యూట్ ఫోటోలు..

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భగవంత్ కేసరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బాలకృష్ణతో రొటీన్ ఎంటర్టైన్మెంట్ కాకుండా నా నుంచి ఎవరూ ఊహించని సినిమా చేయాలనుకున్నాను. నేను చాలా కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ భగవంత్ కేసరి. అయితే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సింది. నేను అనుకున్నంత అవ్వలేదు. ఆ సినిమా రిలీజ్ కి కొన్ని డేస్ ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన జైల్లో ఉన్నారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్, కొంతమంది నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు భగవంత్ కేసరిని ఆదరించారు. కానీ ఆ సమయంలో అలా అవ్వడంతో చాలా మంది సినిమాని చూడలేకపోయారు. పరిస్థితులు బాగుంటే ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఆ విషయంలో కాస్త బాధపడ్డాను అని తెలిపారు.

Also Read : Honey : నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. భయపడాల్సిందే..