Nidhhi Agerwal Turned as Dancer for Item Song
Nidhhi Agerwal : నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చి అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో.. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. నిధి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఒప్పుకున్న తర్వాత ఏ సినిమాని ఓకే చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఓకే చేసింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు. అయితే ఇలాంటి సమయంలో నిధి ఐటెం సాంగ్ కి ఓకే చెప్పిందట. గతంలో ఐటెం సాంగ్స్ అంటే వేరే డ్యాన్సర్లు చేసేవాళ్ళు. కానీ గత కొన్నాళ్లుగా హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్, తమన్నా, పూజాహెగ్డే.. ఇలా స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ చేసారు. రీసెంట్ టైమ్స్ లో సమంత, శ్రీలీల పుష్ప సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టేసారు. తాజాగా కేతిక శర్మ కూడా రాబిన్ హుడ్ సినిమాలో ఐటెం సాంగ్ తో అదరగొట్టేసింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నిధి అగర్వాల్ చేరింది.
Also Read : Dil Raju : వాళ్ళిద్దర్నీ కలుపుతున్న దిల్ రాజు.. ఈసారి మరింత భారీగా..?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న ‘జాట్’ సినిమాలో నిధి అగర్వాల్ ఐటెం సాంగ్ కి ఓకే చెప్పిందట. త్వరలోనే ఆ సాంగ్ షూట్ జరగనుంది అని సమాచారం. జాట్ సినిమా పాన్ ఇండియా వైడ్ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే నిధికి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ దక్కే అవకాశాలు ఉన్నాయి అని భావించిందేమో.
Also Read : Rajamouli : దెబ్బకి అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేసి.. సెట్ వేద్దామని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి..
అయితే ఇన్నాళ్లు హరిహర వీరమల్లు సినిమాకు అగ్రిమెంట్ ఉండటంతో వేరే సినిమా ఆఫర్స్ వచ్చినా వదిలేసుకోవాల్సి వచ్చింది నిధికి. కానీ రాజాసాబ్ ప్రభాస్ సినిమా కావడంతో పర్మిషన్ తీసుకొని చేస్తుంది. అలా హీరోయిన్ గా ఆఫర్స్ వదులుకొని ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడం గమనార్హం. ఇక హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. మరి హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు రిలీజ్ అయ్యాక అయినా నిధి అగర్వాల్ కి హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయా చూడాలి.