Nidhhi Agerwal : ‘సీజ్ ది షిప్’.. హరిహర వీరమల్లు పై నిధి అగర్వాల్ అదిరిపోయే పోస్ట్..

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో నిధి సైతం జాయిన్ కానున్నారు.

Nidhi Agarwal special post on Pawan kalyan Harihara Veeramallu movie

Nidhhi Agerwal : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాళీ సమయం దొరికినప్పుడల్లా ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ చేస్తూ పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒప్పుకున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు.

Also Read : Sitara-Sukriti : సుకుమార్ కూతురితో మహేష్ కూతురు.. ఫొటోస్ చూసారా..

గత మూడు ఏళ్లుగా ఈ సినిమాను చేస్తున్నారు అయినా కూడా పూర్తవ్వలేదు. పవన్ డేట్స్ ఇప్పటికి దొరకడంతో మళ్ళీ ఈ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. గతకొంత కాలంగా నిధి ఆన్ స్క్రీన్ పై కనిపించడం లేదు. ఇప్పుడు పవన్ సినిమాతో మళ్ళీ కనిపించనుంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో నిధి సైతం జాయిన్ కానున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది.

అయితే నిధి సినిమాతో బిజీగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడు ఆమె నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుండి పవన్ లేటెస్ట్ లుక్ ఒకటి షేర్ చేసింది. దానికి పవన్ చెప్పిన ఓ డైలాగ్ కూడా జోడించింది. తాజాగా పవర్ స్టార్ పవన్.. బియ్యం అక్రమ రవాణాని అడ్డుకుని ‘సీజ్ ది షిప్’ అని అన్న డైలాగ్ ఎంత వైరల్ గా మారిందో తెలిసిందే. ఈ డైలాగ్ ని నిధి ఆ ఫోటోకి జోడించింది. దీంతో నిధి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.