Nidhie Agarwal Hot Comments On Exposing
Nidhie Agarwal: అందాల భామ ‘నిధి అగర్వాల్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటూ దూసుకెళ్తోంది. అటు తమిళంలోనూ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ కూడా సినిమాల్లో రాణిస్తూ తన సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు హద్దులు లేవంటూ అమ్మడు చేసే గ్లామర్ షోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Nidhie Agerwal: అందాలను ఆరబోస్తున్న నిధి అగర్వాల్!
అయితే నిధి అగర్వాల్ తాజాగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఛాన్సులు దొరకాలంటే ఏం చేయాలనే అంశంపై కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో రాణిస్తున్నవారు కూడా అలాటి పని చేస్తేనే వారికి సినిమా ఛాన్సులు వస్తాయంటూ నిధి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఏ సినిమా అయినా ఎక్స్‌పోజింగ్ చేయాల్సిందేనని.. అలా చేసినవారికే సినిమాల్లో అవకాశాలు మెండుగా వస్తాయని ఆమె అంటోంది. ఇది కేవలం కొత్తవారికి మాత్రమే కాదని, సినిమాల్లో రాణిస్తున్న హీరోయిన్లకు కూడా వర్తిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.
Nidhi-Simbu: శింబుతో నిధి పెళ్లి.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్?
ఇప్పుడు నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారడంతో ఈ కామెంట్స్ ఎలాంటి వివాదానికి దారి తీస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళంలోనూ గ్లామర్ డోస్ పెంచుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంది.