Niharika Konidela Enjoying Vacation in Thailand and playing with Elephants
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం మళ్ళీ నటిగా, నిర్మాతగా సినిమాలతో బిజీ అవుతుంది. ఒకప్పుడు సినిమాలు, సిరీస్ లు, షోలు చేసిన నిహారిక మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇక పెళ్లి, ఆ తర్వాత విడాకులు.. ఇలా కొన్ని రోజులు వైరల్ అయింది. విడాకుల అనంతరం మళ్ళీ తన కెరీర్ పై ఫోకస్ చేసింది నిహారిక. ఓ పక్క నటిగా, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ మరో పక్క తన మనసుకు సంతోషాన్ని వెతుక్కుంటుంది.
నిహారిక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంది. తాజాగా నిహారిక థాయ్‌లాండ్(Thailand) వెళ్ళింది. గత నాలుగు రోజులుగా నిహారిక థాయ్‌లాండ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. థాయ్‌లాండ్ లోని అడవుల్లో, కొలనులో తిరిగేస్తూ, అక్కడే తింటూ, అక్కడే ఉంటూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది.
Also Read : Teja Sajja : తేజ సజ్జకి ఆపరేషన్.. ‘హనుమాన్’ కోసం ఎన్ని రిస్క్‌లు చేసి కష్టపడ్డాడో తెలుసా?
థాయ్‌లాండ్ లో ఏనుగులు ఉన్న ఓ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఏనుగులతో ఆడుకుంటుంది. కొలనులో వాటితో కలిసి స్నానాలు చేస్తూ సరదాగా అల్లరి చేస్తుంది. వీటన్నిటిని నిహారిక ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు నిహారిక థాయ్‌లాండ్ ట్రిప్ లోనే ఉండొచ్చని తెలుస్తుంది.