సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లోనిహారిక సినిమా..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో, మెగా డాటర్ కొణిదెల నిహారిక ఒక సినిమా చెయ్యబోతుంది. సుకుమార్.. తన అసిస్టెంట్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, తనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందివ్వడంతో పాటు, తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నాడు. సహ నిర్మాతలుగా, గీతా ఆర్స్ట్ అల్లు అరవింద్, అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు వ్యవహరిస్తారు. కథ విని నిహారిక ఇంప్రెస్ అయ్యి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు..
హీరోతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. నాగబాబు గతకొద్ది రోజులుగా నిహారిక పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నిహారిక ప్రస్తుతం సూర్యకాంతం సినిమా చేస్తుంది. మార్చ్ నెలాఖరులో ఈ సినిమా రిలీజ్ కానుంది.
వాచ్ టీజర్…